
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో పాన్ ఇండియా మూవీగా వస్తున్న సినిమా ఆదిపురుష్. ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ టైం డైరెక్ట్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమాగా ఆదిపురుష్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా నుండి త్వరలో క్రేజీ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. ఏప్రిల్ 21 శ్రీరామనవమి సినిమా సందర్భంగా ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
రామాయణ ఇతిహాస నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి శ్రీరామనవమి కానుకగా సినిమాలో నటిస్తున్న అన్ని పాత్రలను రివీల్ చేస్తారని తెలుస్తుంది. ఈ స్పెషల్ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. సినిమాలో సైఫ్ ఆలి ఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి రాధే శ్యాం అప్డేట్ గురించి వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు రామనవమి కానుకగా ఆదిపురుష్ టీం సర్ ప్రైజ్ చేయనుంది.