ఎన్టీఆర్ 30.. జనతా గ్యారేజ్ కాంబో ఫిక్స్..!

నందమూరి ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ 30వ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రం తో సినిమా చేయాల్సి ఉండగా 30వ సినిమా కొరటాల శివతో ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. త్రివిక్రం సినిమాను వాయిదా వేసుకుని కొరటాల శివతో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. రెండోసారి ఈ ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తుండగా మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటుగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్.


2022 ఏప్రిల్ 29న ఈ సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవలేదు. త్రివిక్రం సినిమా మొదలు పెట్టలేదు. అలాంటిది కొరటాల శివ మొదలు పెట్టడం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ఆచార్య సినిమ చేస్తున్న కొరటాల శివ ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది. అయితే దాని కన్నా ముందే ఎన్.టి.ఆర్ సినిమా ముందు చేస్తాడని టాక్.