
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మేజర్. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం. 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ నేపథ్యంతో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథా స్పూర్తితో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టీజర్ తెలుగులో మహేష్, హిందీలో సల్మాన్ ఖాన్, మళయాళంలో పృధ్వి రాజ్ రిలీజ్ చేశారు. 26/11 ముంబై బాంబు పేలుల్లలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలు కోల్పోయిన సొల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ కనిపించనున్నారు.
సినిమాలో శోభిత దూళిపాల, సయి మంజ్రేకర్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. సినిమా టీజర్ చూస్తే ఈ సినిమా కోసం ఈ యువ టీం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు చిత్రయూనిట్. ముఖ్యంగా దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడటం సోల్జర్ పని అని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు మహేష్ సపోర్ట్ కు చాలా థ్యాంక్స్ అని అన్నారు అడివి శేష్.