
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖిలాడి. రవితేజ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
టీజర్ విషయానికి వస్తే.. మరోసారి తన ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. టీజర్ మొత్తం డైలాగ్స్ లేకుండా చివర్లో ప్లే స్మార్ట్ వితౌట్ స్టుపిడ్ ఎమోషన్స్.. యు ఆర్ అన్ స్టాపబుల్ అని అదిరిపోయే డైలాగ్ చెప్పాడు రవితేజ. ఈ ఇయర్ మొదట్లో క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన మాస్ రాజా ఖిలాడితో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. రవితేజ మార్క్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఖిలాడి వస్తుందని తెలుస్తుంది. మే 28 రిలీజ్ డే ప్రకటించినా టీజర్ లో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు అంటే సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నటు టాక్.