పవర్ స్టార్ వకీల్ సాబ్ పై మహేష్ ప్రశంసలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై సూపర్ స్టార్ కామెంట్ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఓ స్టార్ హీరో సినిమాకు అదికూడా పవన్ కళ్యాణ్ సినిమాకు మహేస్ రివ్యూ ఇవ్వడంతో ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. పవన్ కళ్యాణ్ టాప్ ఫాంలో ఉన్నారు.. వకీల్ సాబ్ లో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ ట్వీట్ చేశారు. వాట్ ఏ కం బ్యాక్ అంటూ.. ప్రకాశ్ రాజ్ బ్రిలియంట్ అన్నారు. హృదయానికి హత్తుకునేలా నివేదా థామస్, అంజలి, అనన్యాల పర్ఫార్మెన్స్ ఉంది. థమన్ మ్యూజిక్ అద్భుతం. ఎస్.వి.సి టీం, వేణు శ్రీరాం ఎంటైర్ టీం కు కంగ్రాట్స్ అంటూ మహేష్ కామెంట్ పెట్టారు.

వకీల్ సాబ్ సినిమాపై మహేష్ కామెంట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. తమ హీరో ప్రశంసించడంతో సినిమా చూసిన మహేష్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు జై కొడుతున్నారు. బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేయగా దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు.