
నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం టాలీవుడ్ యువ సెన్సేషన్ అని చెప్పొచ్చు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన నవీన్ ఆ తర్వాత మహేష్ 1 నేనొక్కడినే సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఇక ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో యూట్యూబ్ ఛానెల్ తో సందడి చేసిన నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మెప్పించాడు. ఆ సినిమా హిట్ అవగానే స్వప్న సినిమా బ్యానర్ లో జాతిరత్నాలు సినిమా చేశాడు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి నటనకు అందరు ఫిదా అయ్యారు.
ఈ సినిమా తర్వాత నవీన్ రేంజ్ పెరిగింది. అందుకే నవీన్ పొలిశెట్టి తన తెమ్యునరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తుంది. ఓ బడా నిర్మాణ సంస్థ నవీన్ పొలిశెట్టికి 5 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందట. రెండు సినిమాలకే నవీన్ 5 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం నవీన్ పొలిశెట్టి ఇమేజ్ డబుల్ ట్రిపుల్ అవడం కన్ ఫాం అని చెప్పొచ్చు.