
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఒక పాత్రలో అఘోరా లుక్ కూడా ట్రై చేస్తున్నట్టు టాక్. అప్పుడెప్పుడే బిబి3 అంటూ ఓ టీజర్ వదిలారు కాని ఆ తర్వాత సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. సినిమా టైటిల్ పై రకరకాల వార్తలు వచ్చాయి. కనీసం సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు.
ఫైనల్ గా ఉగాది సందర్భంగా బాలకృష్ణ బిబి3 సినిమా అప్డేట్ వస్తుందని ఆశిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే దీనీకి సంబందించిన అప్డేట్ రావాల్సి ఉంది. బాలయ్య బాబు సినిమా నుండి ఏదో ఒకటి రిలీజ్ ఆశిస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు ఈ ఉగాది అయినా ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి.