అక్కడ చావు కబురు చల్లగా రిలీజ్ ఎప్పుడంటే..!

ఆరెక్స్ 100 హీరో కార్తికేయ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమాను కౌశిక్ డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మొదటి డిజాస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచింది. మార్చ్ 19న రిలీజైన ఈ సినిమా అంచనాలు అందుకోకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమాను ఆహాలో రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్ చేశారు.

ఏప్రిల్ 23న చావు కబురు చల్లగా సినిమా ఆహాలో రిలీజ్ అవుతుంది. మరి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయలేని ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో బస్తీ బాలరాజుగా కార్తికేయ తన నటన పరంగా మెప్పించినా కథ, కథనాలు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది.