
సూపర్ స్టార్ మహేష్ నిర్మాణంలో అడివి శేష్ హీరోగా శశికిరణ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మేజర్. 26/11 టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా వస్తుంది. తెలుగులో కొత్త కథలను చేస్తూ సత్తా చాటుతున్న అడివి శేష్ మేజర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు. మేజర్ సినిమా మహేష్ ప్రొడ్యూస్ చేయడం మరో ప్రత్యేకమైన అంశమని చెప్పొచ్చు.
ఇక మేజర్ సినిమా టీజర్ ను ఈ నెల 12 న సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ ప్లాన్ చేశారు. మేజర్ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అడివి శేష్ ఈ సినిమాతో పాటుగా సూపర్ హిట్ మూవీ గూఢచారికి సీక్వల్ కూడా తెరకెక్కిస్తున్నాడు.