అదే వేడి.. అదే వాడి.. వకీల్ సాబ్ పై చిరు రియాక్షన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఫ్యామిలీతో కలిసి చూశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా చూసి నా స్పందన తెలియచేస్తానని చెప్పిన చిరు ఫైనల్ గా సినిమా చూసి తన కామెంట్ పెట్టారు. ఇక మూడేళ్ల తర్వాత మళ్లీ అదే వేడి.. అదే వాడి.. అదే పవర్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ పెట్టిన చిరు కోర్ట్ రూం సన్నివేశం అద్భుతం. చిత్రయూనిట్ కు నా శుభాకాంక్షలు అంటూ మెసేజ్ పెట్టారు. డైరక్టర్ వేణు శ్రీరాం, దిల్ రాజు, బోనీ కపూర్ లకు తన విషెస్ అందించారు చిరు. చివరగా మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియచేసే సినిమా ఇదని అన్నారు. కేసులనే కాదు మనసులని గెలిచాడు వకీల్ సాబ్ అని కామెంట్ పెట్టారు. 

వకీల్ సాబ్ పై చిరు పెట్టిన ట్వీట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. వేణు శ్రీరాం డైరక్షన్ లో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.