
ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ నెల చివర్లో లేదా మే ఫస్ట్ వీక్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.హారిక హాసిని క్రియేషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ ఉప్పెన డైరక్టర్ బుచ్చి బాబు డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్.
ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా తారక్ తో చేస్తాడని టాక్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ డిఫరెంట్ గా ఉంటాడని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.