పుష్ప డేట్ కు ఆచార్య..?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. మే 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. మే 13న అనుకున్న పుష్ప సినిమా కాస్త ఆగష్టు 13 న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆగష్టు 13న ఆల్రెడీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ ఫిక్స్ చేశారు. సుకుమార్, బన్నీ కూడా ఆగష్టు నుండి అక్టోబర్ కు పుష్పని వాయిదా వేస్తున్నట్టు టాక్.

తెలుగు రెండు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలు విధిస్తారని అంటున్నారు. అందుకే ఏప్రిల్ 23న రిలీజ్ అనుకున్న టక్ జగదీష్ సినిమా మే 1కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మే 13న అనుకున్న ఆచార్య కాస్త ఆగష్టుకి వాయిదా వేస్తున్నారట. అయితే అక్టోబర్ 13న పుష్ప వస్తే మరి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు.