
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వచ్చిన సినిమా వకీల్ సాబ్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ తోనే రికార్డ్ వ్యూస్ సాధించింది. యూఎస్ లో 226 లొకేషన్స్ లో వకీల్ సాబ్ రిలీజైంది. ప్రీమియర్స్ తోనే 3,00,215 డాలర్లు వసూళు చేసినట్టు తెలుస్తుంది. ప్రీమియర్స్ తో ఈ రేంజ్ హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించడం అది పవన్ కళ్యాణ్ వల్లే అయ్యిందని చెప్పొచ్చు.
యూఎస్ లో పవన్ మేనియా ఏంటన్నది మరోసారి ఈ వసూళ్లని చూస్తే అర్ధమవుతుంది. ప్రీమియర్ వసూళ్లే ఇలా ఉంటే రెగ్యులర్ షోస్ కు కూడా ఇదే హవా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో 6 కోట్ల బిజినెస్ చేసిన వకీల్ సాబ్ ప్రీమియర్ కలక్షన్స్ ను చూస్తుంటే మొదటి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ తెచ్చుకునేలా ఉన్నారు. మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సూపర్ హిట్ బొమ్మగా వకీల్ సాబ్ నిలిచిందని చెప్పొచ్చు.