
ఒక్క ఫ్లాపు లేకుండా సినిమా సినిమాకు తన రేంజ్.. సినిమా రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం సినిమాలో ఎన్.టి.ఆర్ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ షూట్ జరుగుతుందట. అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ మొదటి రెండు సార్లు చేసినా అవుట్ మీద జక్కన్న అంత సంతృప్తిగా లేరట. అందుకే మూడు సార్లు ఈ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారని టాక్.
సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు 400 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా అజయ్ దేవగన్, అలియా భట్ నటిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ ఒలివియా మోరిస్ కూడా నటిస్తున్నారు.