
కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీ లాస్ట్ ఫ్రై డే రిలీజైంది. టాక్ ఎలా ఉన్నా ఈ సినిమా కలక్షన్స్ మాత్రం బాగున్నాయి. ప్రత్యేకమైన సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కు మాత్రమే నచ్చేలా ఈ సినిమా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సూపర్ రివ్యూ ఇచ్చారు. రీసెంట్ గా సినిమా చూసిన చిరంజీవి సినిమా ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి తెలుగు వాడు చూడాలని అన్నారు. సోదరుడు నాగార్జున, దర్శకుడు సోలమన్ అద్భుతమా సినిమా తెరకెక్కించారని ట్వీట్ చేశారు.
చిరు ట్వీట్ తో వైల్డ్ డాగ్ టీం కు నూతన ఉత్సాహం వచ్చింది. హైదరబాద్ లో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ నేపథ్యంతో ఈ సినిమా తీశారు. ఆఫీసర్, మన్మథుడు 2 సినిమాల ఫ్లాప్ తర్వాత నాగార్జున ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారని చెప్పొచ్చు. సినిమాపై చిరు ట్వీట్ ఆడియెన్స్ లో కూడా సినిమాపై ఆసక్తి పెంచేలా చేసింది.
..చూపించిన నా సోదరుడు @iamnagarjuna వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు #Solomon,నిర్మాత #NiranjanReddy లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు,తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం..డోంట్ మిస్ దిస్ #WildDog ! వాచ్ ఇట్ !! 2/2