సాయి ధరం తేజ్ రిపబ్లిక్ టీజర్..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా దేవా కట్టా డైరక్షన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. ప్రస్థానం సినిమాతో తనకంటూ ఓ మార్క్ ఏర్పరచుకున్న దేవా కట్ట ఆ తర్వాత సినిమలైతే చేశాడు కాని ఆ రేంజ్ హిట్ అందుకోవడంలో విఫలమయ్యాడు. సాయి ధరం తేజ్ తో రిపబ్లిక్ అంటూ మరో ప్రయత్నం చేస్తున్నాడు దేవా కట్ట. పవర్ ఫుల్ టైటిల్ తో మరోసారి మన రాజకీయ వ్యవస్థ మీద తన మార్క్ పంచ్ వేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

సాయి ధరం తేజ్ ఈ సినిమాతో మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు. సినిమా నుండి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్, బుచ్చి బాబు పాల్గొన్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే దేశ ప్రజాస్వామ్యంపై హీరో చెప్పిన డైలాగ్స్ తోనే సినిమా డెప్త్ అర్ధమవుతుంది. తప్పకుండా రిపబ్లిక్ మరో ప్రస్థానం అయ్యేలా ఉందని చెప్పొచ్చు. మరోసారి దేవా కట్ట తన పెన్ పవర్ ఏంటో చూపించాడు. జూన్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.