
ఈమధ్య వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్నాడు మ్యూజిక్ డైరక్టర్ థమన్. ఆయన చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందిస్తున్నాయి. ఒకవేళ సినిమా టార్గెట్ మిస్సైనా థమన్ మ్యూజిక్ మాత్రం హిట్ అనేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన యువరత్న, వైల్డ్ డాగ్ సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించారు. త్వరలో రిలీజ్ అవబోతున్న వకీల్ సాబ్ కు థమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా థమన్ తన కెరియర్ లో బెస్ట్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. శంకర్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా చేస్తున్న సినిమాకు థమన్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ అయ్యాడట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో థమన్ ఫైనల్ అవడం విశేషం. శంకర్ సినిమా అంటే ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ కూడా ఫిక్స్. కాని రెహమాన్ తో కాకుండా ఈసారి థమన్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు శంకర్. శంకర్ డైరక్షన్.. చరణ్ హీరోగా.. నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో థమన్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు.