
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా ప్రకటించారు. ఏప్రిల్ 9న రిలీజ్ అవుతున్న వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నివేదా థామస్ కు కరోనా రావడంతో ఆమెతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న వారు.. ఆమెను ఇంటర్వ్యూ చేసిన వారు కూడా కంగారు పడుతున్నారు. తనకు కరోనా వచ్చినట్టు ప్రకటించిన నివేదా థామస్ ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు చెప్పారు.. తన గురించి ప్రార్ధిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపింది.
అంతేకాదు తను త్వరగానే దీని నుండి బయటపడతానని చెప్పింది. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ టైం లో నివేదా థామస్ కు కరోనా పాజిటివ్ రావడం ఆ చిత్రయూనిట్ కు షాక్ ఇచ్చింది. సినిమా ప్రమోషన్స్ యాక్టివ్ గా చేయాల్సిన టైం లో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటించిన నివేదా ఇలా కరోనా బారిన పడటం వారికి షాక్ ఇచ్చింది. ఇక పవర్ స్టార్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నారు. ముందు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు కాని అది కుదరలేదు. రిలీజ్ కు ఇంకా ఐదు రోజులే ఉండగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని అనుకుంటున్న టైం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు.