
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగష్టు 13న నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. బన్నీ కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న పుష్ప సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ తో కనిపిస్తాడట. సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్స్ వదిలారు కాని టీజర్ మాత్రం రాలేదు.
ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప టీజర్ వస్తుంది. ఈ టీజర్ కు సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అడవిలో పరుగెడుతున్న అల్లు అర్జున్ 18 సెకన్ల వీడియోతో వావ్ అనిపించారు. పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ ఏప్రిల్ 7 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అని ప్రకటించారు. సుకుమార్ క్రియేటివిటీ, అల్లు అర్జున్ టాలెంట్ రెండు కలిపి పుష్ప సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారని తెలుస్తుంది. పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.