
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కలిసి భారీ డీల్ ఏర్పరచుకున్నారు. ఒకటి రెండు కాదు ఈ రెండు ప్రొడక్షన్స్ కలిసి ఏకంగా 15 సినిమాలను తీసేలా ప్లాన్ చేశారు. అందులో తక్కువ బడ్జెట్ తో కొత్త వారికి అవకాశం ఇస్తూ కొన్ని సినిమాలు.. మూడు మీడియం బడ్జెట్ సినిమాలు.. మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఉంటాయని తెలుస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలుగా ప్లాన్ చేసిన వాటిలో రెండు సినిమాలు పవన్ హీరోగా చేస్తారని తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో వకీల్ సాబ్ గా రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత మళయాళ మూవీ రీమేక్ గా వస్తున్న సినిమా దసరాకి రిలీజ్ అనుకుంటున్నారు. ఇక క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలు పూర్తి చేశాక పవన్ తన నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.