వైష్ణవ్ తేజ్ మొదలుపెట్టాడు..!

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అలాంటి కథ సెలెక్ట్ చేసుకోడానికి గట్స్ ఉండాలి. ఉప్పెన రిలీజ్ కు ముందే క్రిష్ తో సినిమా పూర్తి చేసిన వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ గా తన థర్డ్ మూవీ ముహుర్తం పెట్టుకున్నాడు. బోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో గిరీశయ్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాకు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన గిరీశయ్య తమిళ అర్జున్ రెడ్డి ఆదిత్య వర్మని డైరెక్ట్ చేశాడు. తన సెకండ్ సినిమాను వైష్ణవ్ తేజ్ తో చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరక్టర్. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఆకాశ్ పూరీ రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కెతిక ఆ సినిమా రిలీజ్ అవకుండానే వరుస సినిమా ఛాన్సులు అందుకుంటుంది. ఇప్పటికే నాగ శౌర్య లక్ష్య సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది. లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ తో కూడా జోడీ కడుతుంది.