ఈ అవార్డ్ వారికి అంకితం : రజినీకాంత్

కేంద్ర ప్రభుత్వం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. రజినీకి అత్యున్నత పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. తనకు అందించిన ఈ పురస్కారాన్ని ముగ్గురు వ్యక్తులకు అంకితం చేశారు రజినీ. తన కెరియర్ తొలి రోజుల్లో తనని ఎంతగానో ప్రోత్సహించిన వారికి ఇది అంకితం ఇచ్చారు. బస్ కండక్టర్ గా చేస్తున్న టైం లో తనలోని యాక్టింగ్ టాలెంట్ ను మొదట గుర్తించి ప్రోత్సహించిన బస్ డ్రైవర్ రాజ్ బహదూర్.. తన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అన్న సత్యనారాయణ గైక్వాడ్.. తన గురువు కె.బాలచందర్ కు ఈ అవార్డ్ ను అంకితం చేస్తున్నట్టు చెప్పారు రజినీకాంత్. 

తమిళ సినీ పరిశ్రమలో శివాజి గణేశన్, బాలచందర్ ఇద్దరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. వారి తర్వాత ఈ అత్యున్నత అవార్డ్ అందుకుంటున్న మూడవ వ్యక్తిగా రజినీకాంత్ నిలిచారు.