
అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఉగాది కానుకగా ఏప్రిల్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మొన్నటివరకు కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని అనుకోగా సినిమాలోని సారంగ దరియా సాంగ్ సూపర్ హిట్ అవడంతో మేకర్స్ ప్లాన్ మార్చేశారు. సాయి పల్లవికి కన్నడ, మళయాళ బాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటుగా కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.
తెలుగులోనే తీసినా సాయి పల్లవి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు లవ్ స్టోరీ సినిమాను మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరి జోడీ కూడా చాలా బాగుంది. అయితే చైతు సినిమా మూడు భాషల్లో రిలీజ్ అంటే డేరింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య లవ్ స్టోరీతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.