RRR నుండి అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్..!

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా RRR. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ రామరాజు పాత్రలో.. తారక్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా ప్రచార చిత్రాలు అంచనాలు పెంచాయి. ఇక సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర కూడా హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. 

ఇక లేటెస్ట్ గా ట్రిపుల్ R నుండి అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తిరుగుబాటు వీరుడిగా అజయ్ దేవగన్ లుక్ అదిరిపోయింది. సౌత్ లో మొదటి సినిమా చేస్తున్న అజయ్ దేవగన్ RRR లో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. RRR సినిమాలో ఆయన కూడా తన నటనతో మెప్పిస్తారని అంటున్నారు. అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఇంకా చాలా అద్భుతాలు ఉంటాయని తెలుస్తుంది. సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.