
ఉప్పెన సినిమాతోనే మొదటి మూవీతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. మెగా మేనల్లుడిగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ అదిరిపోయిందని చెప్పొచ్చు. బుచ్చి బాబు డైరక్షన్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా హిట్ అవడంతో అందరి చూపు వైష్ణవ్ తేజ్ మీద పడ్డది. ఉప్పెన రిలీజ్ కు ముందే క్రిష్ డైరక్షన్ లో సినిమా చేసిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో కూడా మరో హిట్ కొడతాడని అంటున్నారు.
ఇదిలాఉంటే కింగ్ నాగార్జునతో వైష్ణవ్ తేజ్ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో నాగ్ ఆ వార్తలపై స్పందించారు. వైష్ణవ్ తేజ్ తో తమ బ్యానర్ లో ఓ సినిమా వస్తుందని కన్ఫర్మ్ చేశారు నాగ్. నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని చెప్పారు. వైష్ణవ్ తేజ్ కథ వినగానే ఓకే చేశాడని నాగ్ చెప్పారు. నాగ్ నిర్మిస్తున్నారు అంటే సినిమా తప్పకుండా మినిమం గ్యారెంటీ అన్నట్టే లెక్క. మరి నాగ్ ప్రొడక్షన్ లో వైష్ణవ్ తేజ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.