శంకర్ పై కేసు వేసిన లైకా..!

సౌత్ స్టార్ డైరక్టర్స్ లో టాప్ 3 లో ఉన్న శంకర్ తను తీసే ప్రతి సినిమాతో అటు కమర్షియల్ గా సెన్సేషనల్ హిట్ అందుకోవడమే కాకుండా సామాజిక అంశాలతో సినిమాలు చేస్తూ ఉంటాడని తెలిసిందే. రోబో సూపర్ హిట్ అందుకున్న శంకర్ ఆ తర్వాత ఐ సినిమాతో డిజాస్టర్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన 2.ఓ సినిమా కూడా నిరాశపరిచాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమా సీక్వల్ గా ఇండియన్ 2 సినిమా చేస్తున్న శంకర్ ఆ సినిమా షూటింగ్ లో తన అసిస్టెంట్ డైరక్టర్స్ ను కోల్పోయాడు. షూటింగ్ లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ లో ముగ్గురు అసిస్టెంట్ డైరక్టర్స్ దుర్మరణం పొందారు.

ఇక ఇదిలాఉంటే 500 కోట్లతో తీసిన 2.ఓ సినిమా ఫ్లాప్ అవడంతో లైకా సంస్థతో గొడవలు మొదలయ్యాయి. అయితే ఇండియన్ 2 సినిమా కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అయితే రీసెంట్ గా దిల్ రాజు ప్రొడక్షన్ లో రాం చరణ్ హీరోగా శంకర్ ఓ సినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇండియన్ 2 సినిమా పూర్తి కాకుండా ఆ సినిమా మొదలు పెట్టడం ఏంటని లైకా ప్రొడక్షన్స్ చెన్నై హైకోర్టులో ఫిర్యాదు చేసింది. 180 కోట్లు ఇప్పటికే ఖర్చి చేసిన సినిమాను వదిలేసి మరో సినిమా చేయడంపై లైకా నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. తన బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇచ్చేస్తాం సినిమా పూర్తి చేసి పెట్టాలని నిర్మాతలు కోర్టుని ఆశ్రయించారు. మరి ఈ వివాదంపై శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.