
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ ను పెన్ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన పెన్ స్టూడియోస్ ట్రిపుల్ ఆర్ సినిమా హిందీ థియేట్రిక్ల రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అంతేకాదు హిందీ వర్షన్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను కూడా ఈ సంస్థ కొనేసినట్టు తెలుస్తుంది. ఇందుకుగాను నిర్మాతకు భారీ మొత్తాన్ని కోట్ చేసినట్టు టాక్. రెండు రోజులుగా ఈ చర్చలు సాగుతుండగా ఫైనల్ గా పెన్ స్టూడియోస్ కే హిందీ వర్షన్ రైట్స్ అంటూ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు ఆర్.ఆర్.ఆర్ మేకర్స్.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేసిన్న సెన్సేషనల్ మూవీగా ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, అలియా భట్ తో పాటుగా హాలీవుడ్ స్టార్ ఒలివియా మోర్స్ కూడా నటిస్తున్నారు. అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా బిజినెస్ లో బాహుబలిని బీట్ చేస్తుందని అంటున్నారు.