చైతుతో రాశి ఖన్నా ఫిక్స్..!

అక్కినేని హీరోల్లో సూపర్ ఫాం లో ఉన్న నాగ చైతన్య త్వరలో లవ్ స్టోరీ సినిమాతో రాబోతున్నాడు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా అరుల్ మోహన్, నభా నటేష్ ఇలా చాలా మంది పేర్లు వినిపించినా ఫైనల్ గా థ్యాంక్ యు సినిమాలో రాశి ఖన్నాని ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

నాగ చైతన్యతో వెంకీమామ సినిమాలో నటించింది రాశి ఖన్నా. ఆ సినిమా హిట్ అందుకుంది. అదే సెంటిమెంట్ తో రాశి ఖన్నాని ఈ సినిమాకు తీసుకున్నారు. నాగ చైతన్య, రాశి ఖన్నా మరోసారి జత కడుతున్నారు. చైతు లవ్ స్టోరీ ప్రచార చిత్రాలతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచుకుంటుంది. లవ్ స్టోరీ హిట్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే థ్యాంక్ యు సినిమాకు మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు మిగతా డీటైల్స్ అన్నది త్వరలో తెలుస్తుంది.