రిలీజ్ కు ముందే లీకైన వైల్డ్ డాగ్..!

కింగ్ నాగార్జున హీరోగా సోల్మన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మించారు. హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. నాగార్జున ఈ మూవీలో ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కనిపించారు. ఏప్రిల్ 2న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఒకరోజు ముందే ఆన్ లైన్ లో లీక్ అయిందని తెలుస్తుంది. వైల్డ్ డాగ్ పైరెటెడ్ లింక్ ను షేర్ చేస్తూ నిర్మాతలకు ట్వీట్ చేశాడు ఓ నెటిజెన్.

దాంతో అప్రమత్తమైన చిత్రయూనిట్ ఆ పైరెటెడ్ లింక్స్ తో పాటుగా మరికొన్ని లింక్స్ ను బ్లాక్ చేసింది. మొత్తానికి నాగ్ సినిమా వైల్డ్ డాగ్ రిలీజ్ కు ముందే పైరెటెడ్ లింక్ రిలీజై షాక్ ఇచ్చింది. అయితే రిలీజ్ అవకుండా అలా పైరెట్ అవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చిత్రయూనిట్ కు సంబందించిన వారెవరికైనా ఈ లీక్స్ తో సంబంధం ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆఫీసర్, మన్మథుడు 2 సినిమాల ఫ్లాప్ తో ఈసారి వైల్డ్ డాగ్ తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనుకున్న నాగ్ ఆశలని ఈ పైరసీ న్యూస్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.