రజినికాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే..!

సినీ రంగంలో అత్యున్నర పురస్కారం దాద సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను అందుకోనున్నారు సూపర్ స్టార్ రజినికాంత్. 2019కి సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రజినీకి దక్కింది. కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ రజినీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూపర్ స్టార్ రజినికాంత్ అందుకోనున్నారు. 1969 నుండి ఈ అవార్డులని ప్రకటిస్తున్నారు. 

బాలీవుడ్ లో 32 మందికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రాగా.. ఇతర భాషల నుండి మిగతా 18 మందికి ఈ అవార్డ్ ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగనుండగా ఎలక్షన్స్ ముందు కేంద్ర ఈ అవార్డ్ ప్రకటించడంపై హాట్ టాపిక్ గా మారింది. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు రజినికాంత్.