'రారాజు' మెగాస్టార్.. రీమేక్ సినిమాకు అదిరిపోయే టైటిల్..!

మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ గా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ టైటిల్ ఏంటన్నది మెగా ఫ్యాన్స్ లో ఎక్సయిట్మెంట్ మొదలైంది. లూసిఫర్ రీమేక్ కు క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అంటే రారాజు అని తెలుస్తుంది.

తెలుగు సినీ చరిత్రలో మగ మహరాజు చిరంజీవి. అలాంటి మరోసారి రాజు టైటిల్ ను పెట్టుకుంటున్నాడు. మళయాళ లూసిఫర్ కథను తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్చి సినిమా చేస్తున్నారు. రారాజు మెగాస్టార్ కు పర్ఫెక్ట్ టైటిల్. అయితే ఇదే టైటిల్ తో ఇదివరకు యాక్షన్ హీరో గోపీచంద్ ఓ సినిమా చేశారు. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. లూసిఫర్ రీమేక్ రారాజు ఫిక్స్ చేస్తారా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.