
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే స్పెషల్ గా అల్లు, మెగా ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పుష్ప సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్. సుక్కు, బన్నీ కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాతో ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు.
సినిమాలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఊర మాస్ యాటిట్యూడ్ చూపిస్తారని తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్ పుష్ప బన్నీ ముందు సినిమాల రికార్డులన్ని బద్ధలు కొడుతుందని అంటున్నారు. మరి అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.