
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో మరో ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్న తారక్. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చి బాబుతో తారక్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. హీరో, హీరోయిన్, డైరక్టర్ ఇలా అందరు చేసిన ఉప్పెన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యంది. దర్శకుడిగా బుచ్చి బాబుకి మంచి క్రేజ్ వచ్చింది.
ఉప్పెన తర్వాత నిర్మాతల నుండి భారీ ఆఫర్లు రాగా తన సెకండ్ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ తోనే చేస్తున్నట్టు చెప్పాడు బుచ్చి బాబు. ఇక తన సెకండ్ సినిమాను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. తారక్ తో ఓ ఎక్స్ పెరిమెంట్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. ఎన్.టి.ఆర్ ను 60 ఏళ్ల వృద్ధుడి పాత్రలో చూపించాలని ఫిక్స్ అయ్యాడు బుచ్చి బాబు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే ఈ సినిమాలో తారక్ కొన్ని సీన్స్ లో 60 ఏళ్ల వయసు గల వ్యక్తిగా కనిపిస్తారట. ఈ న్యూస్ బయటకు రాగానే నందమూరి ఫ్యాన్స్ లో జోష్ మొదలైంది. తారక్ 60 ఏళ్ల మేకప్ వేసుకుంటే పెద్దాయన సీనియర్ ఎన్.టి.ఆర్ లా ఉంటాడని అనుకుంటున్నారు. మరి తారక్ చేస్తున్న ఈ ప్రయోగం ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.