RRR నుండి మరో క్రేజీ అప్డేట్..!

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా నుండి మరో సర్ ప్రైజ్ రెడీ అవుతుంది. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు వారి టీజర్లు రిలీజ్ చేశారు. అవి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు RRR లో నటిస్తున్న అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 2న అజయ్ దేవగన్ ట్రిపుల్ R లుక్ రివీల్ చేస్తారట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ప్రకటించింది. RRR లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో భాగమవడంపై అజయ్ దేవగన్ కూడా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్, రామరాజు పాత్రలో చరణ్ ఇద్దరు తమ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని చెబుతున్నారు. అంతేకాదు సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ పాత్ర కూడా సర్ ప్రైజ్ చేస్తుందని టాక్. అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది.