
కింగ్ నాగార్జున హీరోగా ఊపిరి రైటర్ సోల్మన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. హైదరాబాద్ లో గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సినిమా ట్రైలర్ ఆసక్తి పెంచగా ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్లు చేసినట్టు తెలుస్తుంది.
కింగ్ నాగార్జున మార్కెట్ తో పోల్చుకుంటే ఇది తక్కువే అయినా ప్రస్తుతం పాండమిక్ తర్వాత సినిమాల బడ్జెట్టు, హీరోల మార్కెట్ కన్నా తక్కువ మొత్తానికే థియేటర్ రైట్స్ ఇచ్చేస్తున్నారు. లాభాలు వస్తే లెక్క వేరేలా ఉంటుంది.. అదే రిజల్ట్ తేడా కొడితే మాత్రం డిస్టిబ్యూటర్స్ చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే వైల్డ్ డాగ్ సినిమాను నాగార్జున సొంతంగా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. నాగ్ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 10 కోట్లు రాబడితే చాలని తెలుస్తుంది.