చిరులో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు..!

డ్యాన్సుల్లో మెగాస్టార్ చిరంజీవిని కొట్టేవారే లేరు. టాలీవుడ్ కు బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేసింది ఆయనే. చిరు సినిమాల్లో డ్యాన్సులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రత్యేకంగా చిరు డ్యాన్సులకే ఫ్యాన్స్ అయిన వారు లేకపోలేదు. వయసు పైబడుతున్నా చిరులో ఆ డ్యాన్స్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుండి మొదటి సాంగ్ టీజర్ రిలీజైంది. లాహే లాహే అంటూ వస్తున్న ఈ సాంగ్ ప్రోమోలో చిరు తన డ్యాన్స్ గ్రేస్ తో దుమ్ముదులిపేశాడు.

అర నిమిషం పాట ప్రోమోతోనే అదుర్స్ అనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఫుల్ సాంగ్ లో ఇంకే రేంజ్ లో రెచ్చిపోయాడో ఊహించుకోవచ్చు. ఆచార్య సినిమాలో చిరు స్టైల్ కూడా చాలా బాగుంది. సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో లాహే లాహే ఫుల్ సాంగ్ త్వరలో రిలీజ్ కానుంది.