
మాస్ హీరో గోపీచంద్ లీడ్ రోల్ లో సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటీమార్. అసలైతే ఏప్రిల్ 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ నెలాఖరుకి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కబడ్డి బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సీటీమార్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే జ్వాలా రెడ్డి అనే ఫోక్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఆ డేట్ ను రానా దగ్గుబాటి విరాటపర్వం రిలీజ్ బుక్ చేసుకున్నాడు. వేణు ఊడుగుల డైరక్షన్ లో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమా టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. విరాటపర్వం వర్సెస్ సీటీమార్ ఈ రెండు సినిమాల్లో ఏది విజయ పతాకం ఎగురవేస్తుందో చూడాలి.