
ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను అలరించిన కార్తికేయ రీసెంట్ గా చావు కబురు చల్లగా సినిమాతో వచ్చాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కౌశిక్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ్ర ఫెయిల్యూర్ మూవీ అయ్యింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో డిజాస్టర్ మూవీగా మొదటిస్థానం లో నిలిచింది చావు కబురు చల్లగా. ఈ సినిమాలో బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ తన నటనతో మెప్పించాడు.
ఈ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయడంపై కార్తికేయ ఆడియెన్స్ కు సారీ చెప్పాడు. బస్తీ బాలరాజు పాత్ర తనకు చాలా స్పెషల్ అని.. చాలామంది తనని బాగా చేశావని మెచ్చుకున్నారని. అయితే సినిమా కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు.. క్షమించండి నాకు మరో ఛాన్స్ ఇవ్వండి అంటూ కార్తికేయ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేశాడు. సినిమా పోతే పోయింది అనుకోకుండా ఆడియెన్స్ కు తను చేసిన రిక్వెస్ట్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.