
యువ హీరో నితిన్ రంగ్ దే హిట్ తో మళ్లీ కెరియర్ లో మంచి జోష్ కనబరుస్తున్నాడు. లాస్ట్ ఇయర్ లో భీష్మతో హిట్ అందుకున్న నితిన్ ఫిబ్రవరిలో వచ్చిన చెక్ తో డిజాస్టర్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన రంగ్ దే మళ్లీ నితిన్ కు మంచి హిట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్నారు.
నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న తెలుగు అందాదున్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాకు మాస్ట్రో అని టైటిల్ పెట్టారు. నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ మాస్ట్రో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కూడా బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి నితిన్ సరికొత్త బ్లైండ్ అవతార్ అతని ఫ్యాన్స్ ను అలరిస్తుంది.