మెగాస్టార్ 'వీరయ్య'.. మైత్రి మూవీ మేకర్స్ క్రేజీ టైటిల్..!

రీ ఎంట్రీ తర్వాత తన సినిమాల వేగాన్ని పెంచిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ అవగానే లూసిఫర్ రీమేక్, వేదాలం రీమేక్ రెండిటిని ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ రవీంద్ర అస్లియాస్ బాబీ డైరక్షన్ లో కూడా సినిమా లైన్ లో ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. 

జై లవ కుశ, వెంకీ మామ సినిమాల హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాబీ చిరుతో అదిరిపోయే సినిమా చేస్తాడని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు టైటిల్ గా వీరయ్య అని పెడుతున్నట్టు టాక్. ఆల్రెడీ టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. చిరంజీవి వీరయ్య కొద్దిగా టైటిల్ ఓల్డ్ గా అనిపిస్తున్నా సినిమా కంటెంట్ మాత్రం అదిరిపోతుందని అంటున్నారు. ఆచార్య సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాలని ఫిక్సైన చిరు తర్వాత సినిమాలకు సూపర్ ప్లాన్ చేస్తున్నారు.