
బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు అనగానే ఆ సినిమా పవన్ ఎలా టేకప్ చేశారని అందరు ఆశ్చర్యపోయారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఓ ముగ్గురు అమ్మాయిలకు కష్టం వస్తే ఆ కేసు వాధించడానికి వారికి అండగా నిలబడతాడు వకీల్ హీరో. హిందీ, తమిళ వర్షన్ లు కేవలం కంటెంట్ పై మాత్రమే ఫోకస్ పెట్టాయి.
అయితే తెలుగులో పవన్ చేస్తున్నాడు అనగానే ఆయన ఫ్యాన్స్ కోరుకునే కొన్ని కమర్షియల్ అంశాలను యాడ్ చేయాల్సిందే. అందుకే వకీల్ సాబ్ అటు మూల కథను పాడుచేయకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మెప్పించేలా రీ రైట్ చేశాడు డైరక్టర్ వేణు శ్రీరాం. ఏప్రిల్ 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ట్రైలర్ కొద్దిగంటల క్రితం రిలీజైంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ నుండి వస్తున్న సినిమా ఇది. పవర్ స్టార్ ఫ్యాన్స్ మూడేళ్ల ఆకలి తీర్చేలా సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. బలమైన కథతో పాటుగా పవర్ స్టార్ మార్క్ కమర్షియల్ అంశాలు సినిమాను తెలుగు ప్రేక్షకులు మెప్పించేలా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ స్టైల్ అదిరింది. థమన్ మ్యూజిక్ యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టుగా ఉంది. మరి ఏప్రిల్ 9న వకీల్ సాబ్ గర్జన ఎలా ఉంటుందో చూడాలి.