
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సినిమా టైటిల్ పై ఇంతవరకు ఓ క్లారిటీ రాలేదు. మే 28న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగా రిలీజ్ ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండగా సినిమా టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఏప్రిల్ 13 తెలుగు సంవత్సరాది కానుకగా బాలయ్య సినిమా టైటిల్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీద రిలీజ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట.
బాబాయ్ అంటే అమితమైన అభిమానం ఉన్న తారక్ అడగాలే కాని వేడుక దగ్గర ఉండి నిర్వహిస్తాడు. బాలయ్య సినిమా టైటిల్ ను తారక్ రిలీజ్ చేస్తారని టాక్. సో నందమూరి ఫ్యాన్స్ కు ఇంతకంటే మంచి గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. బోయపాటి శ్రీను ఈ సినిమాను నందమూరి ఫ్యాన్స్ అంచనాలను తగినట్టుగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. సింహా, లెజెండ్ తర్వాత మూడవ సినిమాగా ఈ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.