అర్జున్ రెడ్డి డైరక్టర్ తో వైష్ణవ్ తేజ్..!

మెగా ఫ్యామిలీ నుండి వచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ కెరియర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఉప్పెన రిలీజ్ అవకముందే క్రిష్ తో కొండపొలం నవల ఆధారంగా సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తన థర్డ్ మూవీ కథా చర్చల్లో ఉన్నాడు. తమిళ అర్జున్ రెడ్డి డైరక్టర్ గిరీశయ్య చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడట వైష్ణవ్ తేజ్. అతని డైరక్షన్ లో దాదాపు సినిమా కన్ ఫాం అని అంటున్నారు.

అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ ను ముందు సీనియర్ డైరక్టర్ బాలా డైరెక్ట్ చేయగా అది బాగా రాలేదని సందీప్ వంగ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన గిరీశయ్యని పెట్టి సినిమా రీ షూట్ చేశారు. ఆదిత్య వర్మతో సత్తా చాటిన గిరీశయ్యకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. గిరీశయ్య, వైష్ణవ్ తేజ్ కాంబో మూవీని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తారని తెలుస్తుంది. ఇదే కాదు జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ తో కూడా వైష్ణవ్ తేజ్ సినిమా ఉంటుందని లేటెస్ట్ టాక్. చూస్తుంటే మెగా హీరో మంచి ట్రాక్ మీద ఉన్నాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఆకాశ్ పూరీ రొమాంటిక్ మూవీతో టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న అమ్మడు ఆ సినిమా రిలీజ్ అవకుండానే వరుస ఆఫర్లు అందుకుంటుంది.