రవితేజ 'ఘరానా మొగుడు'..!

మాస్ మహరాజ్ రవితేజ ఈ ఇయర్ మొదట్లో క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. సరైన సినిమా పడితే రవితేజ స్టామినా ఏంటన్నది క్రాక్ ప్రూవ్ చేసింది. ఇక ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్న రవితేజ తన నెక్స్ట్ సినిమా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ హిట్ మూవీ ఘరానా మొగుడు సినిమాను పోలి ఉంటుందని టాక్. మాములూఅనే మెగాస్టార్ వీరాభిమాని అయిన రవితేజ ఆయన సినిమా కథ లాంటి ప్రాజెక్ట్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు.

రవితేజ ఎనర్జీకి తగిన కథ పడితే మాత్రం సినిమా సెన్సేషనల్ హిట్ అవడం పక్కా. అది చాలాసార్లు ప్రూవ్ అయ్యింది.. అవుతూ వస్తుంది. కెరియర్ ఈ మధ్య కొద్దిగా వెనకపడినట్టు అనిపించిన రవితేజ క్రాక్ హిట్ ఇచ్చిన జోష్ తో ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు. త్రినాథ రావు సినిమాతో పాటుగా తమిళ సూపర్ హిట్ మూవీ విక్రం వేద రీమేక్ కు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. మల్టీస్టారర్ గా రాబోతున్న ఆ సినిమాలో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకునే స్టార్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.