
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో సత్తా చాటిన నవీన్ పొలిశెట్టి లేటెస్ట్ మూవీ జాతిరత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ రోల్స్ తో ఆడియెన్స్ తో పాటు సినీ సెలబ్రిటీస్ ను సైతం మెప్పించాడు నవీన్ పొలిశెట్టి. అందుకే ఈమధ్య అతని గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీల్ పొలిశెట్టి, అనుష్క మూవీ ఉంటుందని టాక్. ఇక ఇదేకాకుండా సూపర్ స్టార్ మహేష్ కూడా నవీన్ తో సినిమా తీయాలని చూస్తున్నాడట.
స్టార్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా మహేష్ తన టేస్ట్ ఆడియెన్స్ కు చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అడవి శేష్ తో మేజర్ సినిమా చేస్తున్న మహేష్.. నవీన్ పొలిశెట్టితో సినిమా చేయాలని చూస్తున్నాడట. వెంకీ అట్లూరి డైరక్షన్ లో మహేష్ నిర్మాతగా నవీన్ పొలిశెట్టి సినిమా ఉంటుందని టాక్. అదే జరిగితే మాత్రం నవీన్ పొలిశెట్టి దశ తిరిగినట్టే.