మహేష్ కథతో రౌడీ హీరో..!

సూపర్ స్టార్ మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా లైన్ లో ఉంది. అయితే దానికి ముందే త్రివిక్రం తో సినిమా చేస్తాడని టాక్. ఇక ఇదిలాఉంటే మహేష్ తో మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు. పరశురాం సినిమాకు బదులుగా ఆ సినిమా చేయాల్సింది కాని అది ఎందుకో కుదరలేదు. అయితే మహేష్ కు అనుకున్న ఆ కథతోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నాడట వంశీ పైడిపల్లి.

మహేష్ కథతో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో వంశీ పైడిపల్లి ఒకరు. ఆయన సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే విజయ్ దేవరకొండ కూడా వంశీతో సినిమాపై ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని టాక్. పూరీ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. సుక్కు సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మూవీ ఉండే ఛాన్స్ ఉంది. తప్పకుండా ఈ క్రేజీ కాంబో ప్రేక్షకులకు మంచి సినిమా ఇస్తుందని చెప్పొచ్చు.