
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ 65వ సినిమా నెల్సన్ డైరక్షన్ లో వస్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే మాస్టర్ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న విజయ్ తన నెక్స్ట్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దేని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తమిళ సినిమా మూగమూడి సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా హెగ్దే ఆ తర్వాత టాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు మళ్లీ 9 ఏళ్ల తర్వాత తమిళ సినిమాకు సైన్ చేసింది.
ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే పూజా హెగ్దేతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా నటిస్తుందని టాక్. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా పూజా హెగ్దేతో పాటుగా రష్మికని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గా ప్రస్తుతం రేసులో ముందున్న పూజా హెగ్దే, రష్మికలు ఒకే సినిమాలో నటించడం కూడా ఇదే మొదటిసారి. ఆల్రెడీ రష్మిక కార్తీ సుల్తాన్ తో తమిళ తెరకు పరిచయం కాబోతుంది. తన అభిమాన నటుడు విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి అమ్మడు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.