నేను అలాంటివి ఎంకరేజ్ చేయను.. నా ఫ్యాన్ వార్నింగ్ ఇచ్చాడు..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఏప్రిల్ 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. టజ్ కగదీష్ పరిచయ వేడుక అంటూ శనివారం రాజమండ్రిలో ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా నాని తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి చిన్న క్లారిటీ ఇచ్చాడు. అందరి స్టార్స్ లా తన షూటింగ్ దగ్గరకు వచ్చి ఫోటోలు గట్రా దిగుతామని అంటారు.. ఈవెంట్ లలో మాట్లాడకుండా అరుస్తాం అంటే నేను ఒప్పుకోను.. నా ఫ్యాన్స్ నేను గర్వపడేలా చేయాలని.. మీకోసం ప్రతి రోజు ప్రతి సినిమా కష్టపడుతూ మీకు గౌరవాన్ని తెస్తానని అన్నాడు నాని.

అంతేకాదు ఇటుక ఇటుకగా కనడుతున్న నా కష్టం దూరం నుండి చూస్తే పెద్ద గోడ అవుతుందని.. దాన్ని ఢీ కొట్టాలంటే భయపడాలని నాని ఏవేవో డైలాగ్స్ చెప్పాడు. ఫ్యాన్స్ కు మెసేజ్ ఇవ్వడం వరకు ఓకే కాని నాని ఇటుక, గోడ లాంటి డైలాగ్స్ ఎందుకు కొట్టాడో అర్ధం కాలేదు. నాని టక్ జగదీష్ సినిమాను ముందు ఏప్రిల్ 16న రిలీజ్ అనుకున్నారు. ఆ టైంలో నాగ చైతన్య లవ్ స్టోరీ వస్తుందని నాని సినిమాను ఏప్రిల్ 23కి వాయిదా వేయించారు. ఒకవేళ నాని ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఇలా మాట్లాడాడా అంటూ కొందరు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా టక్ జగదీష్ ఫ్యామిలీని పరిచయం చేసి ఒక్కొక్కరి గురించి చెప్పి ప్రేక్షకులను అలరించాడు నాని. అంతేకాదు తన షూటింగ్ దగ్గరకు వచ్చి ఒక అభిమాని నాని తనని కలవనివ్వకుంటే షూటింగ్ జరగనివ్వను అంటూ వార్నింగ్ ఇచ్చాడని.. వార్నింగ్ కూడా ఇలా ఇవ్వడం రాజమండ్రి ప్రేక్షకుల స్పెషాలిటీ అంటూ మాట్లాడాడు నాని.