గోపీచంద్ మళ్లీ వాయిదా వేశాడు..!

మాస్ కటౌట్ ఉన్న హీరో గోపీచంద్ కెరియర్ మొదట్లో మంచి దూకుడు ప్రదర్శించినా ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డాడు. సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆడియెన్స్ ను మెప్పించడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో సీటీమార్ సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ ప్లాన్ చేశారు. కాని ఇంతవరకు ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ చేయట్లేదట.

ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్ రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ హీరో కార్తీ నటించిన సుల్తాన్ కూడా అదే రోజున వస్తుంది. ఇదే కాదు వారం తర్వాత అంటే ఏప్రిల్ 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాల మధ్యలో సీటీమార్ నెగ్గుకు రావడం కష్టమని భావించారో ఏమో కాని సినిమా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. అటు డైరక్టర్ గా సంపత్ నంది.. హీరోగా గోపీచంద్ ఇద్దరు హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.