
టైటిల్ చూసి కచ్చితంగా అందరు షాక్ అయ్యే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సిఎం అవడం ఏంటి ఆయన అసలు రాజకీయాల్లోనే లేడు కదా.. ఫాదర్, బాబాయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా సరే ఎప్పుడూ చరణ్ క్యాంపెయినింగ్ చేసింది కూడా లేదు మరి అలాంటిది చరణ్ ఎలా సిఎం అవుతాడని అనుకోవచ్చు. చరణ్ సిఎం అయ్యేది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న చరణ్ ఆ సినిమాల తర్వాత శంకర్ డైరక్షన్ లో చరణ్ సినిమా ఉంటుందని తెలిసిందే.
ఈ సినిమాలో చరణ్ సిఎం గా కనిపిస్తారని టాక్. శంకర్ సిఎం కథ అనగానే అందరు అర్జున్ తో తీసిన ఒకే ఒక్కడు సినిమా గుర్తుకు రాక మానదు. అప్పుడెప్పుడో ఆ సినిమాకు సీక్వల్ చేస్తా అని కూడా చెప్పాడు శంకర్. ఒకవేళ రాం చరణ్ తో తీసే సినిమా ఒక్కరోజు సిఎం సినిమాకు కొనసాగింపుగానా అన్నది మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. మొత్తానికి చరణ్ సిఎం అనగానే ఆడియెన్స్ లో ఓ ఎక్సయిటిమెంట్ మొదలైంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2022 చివర్లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.